ఏబీవీపీ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

ABVP:అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 44 వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను ఈ రోజు మంచిర్యాల ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల ఆవరణంలో కళాశాల ప్రిన్సిపల్ ఐత శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా వ్యవస్థ ప్రముఖ్‌ చెట్టి శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ లావుడ్య అనిల్ కుమార్ మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 44 వ రాష్ట్ర మహాసభలు జనవరి 3,4,5 తేదీలలో శంషాబాద్ లో నిర్వహిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, విశిష్ట అతిథిగా ఏబీవీపీ అఖిల భారత సంఘటన కార్యదర్శి ఆశిష్ చౌహాన్, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు జానా రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు పాల్గొంటారని స్ప‌ష్టం చేశారు.

రాష్ట్ర నలుమూలల నుండి 1000 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవుతారని చెప్పారు. ఈ మహాసభలలో విద్యా రంగా స్థితిపైన తీర్మానాలు చేయనున్న‌ట్లు చెప్పారు. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చించనున్న‌ట్లు వారు స్ప‌ష్టం చేశారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని అన్నారు . ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శివ , సంజయ్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like