ప్రాణాంతక ప్రయాణం
గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై బోగీలపై కూర్చొని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకుని స్టేషన్ తరలించారు. తెలంగాణలోని మంచిర్యాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. గోరఖ్‌పూర్ రైలుపై ఓ వ్యక్తి కూర్చుని ప్రయాణిస్తున్న విషయాన్ని బెల్లంపల్లిలో గుర్తించారు. బెల్లంపల్లి రైల్వే అధికారులు మంచర్యాలకు సమాచారం అందించారు. మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో రైలు ఆగగానే, బోగీల మధ్య ఉన్న అతడిని గమనించిన పోలీసులు కిందికి దించారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్ తరలించారు. అసలు అతను ఎవరు? ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నాడు? అనే వివరాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించినందుకు అతనిపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. రైళ్లలో ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలు చేయవద్దని ప్రయాణికులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.