జర్నలిస్టుల ఆందోళన.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి
విలేఖరిని అసభ్య పదజాలంతో దూషించిన నాయకుడిపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. సోమవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడించిన వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. క్యాంప్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. ఎన్టీవీ జర్నలిస్టు ను దుర్భాషలాడిన కాంగ్రెస్ నాయకుడు కారుకూరి రామచందర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్తలు రాసిన వారిని ఇష్టం వచ్చినట్లు తిట్టడం ఏమిటని వారు ప్రశ్నించారు. వార్తలు చంపుతామని బెదిరించడం ఎక్కడి సంస్కృతి అంటూ మండిపడ్డడారు. అతనిపై ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఐక్యత వర్థిల్లాలని, ఈ విషయంలో ఎమ్మెల్యే స్పందించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.
ఈ ఆందోళనలో పుల్యాల రాజు, వికాస్ యాదవ్, కల్వల ప్రతాప్, నగరం నిరంజన్, అందుగుల రమేష్, బడుగు శ్రీనివాస్, నార్ల శేఖర్, రవిరాజ్, దినేష్, బాబా, సుంకరి నారాయణ, నవీన్, శ్రీహరి, సంపత్, సిద్దిఖి, సాలిగామ మల్లేష్, ఎల్క తిరుపతి, కొండు మల్లేష్, సుధీర్, తనుగు కృష్ణమూర్తి, దండబోయిన భాస్కర్, కల్వల అరుణ్, సాయి, బద్రి వెంకటేష్, మోసం శ్రీనివాస్, దామెర విజయ్, మేకల ప్రభాకర్, వేముల వెంకటేష్, లక్ష్మణ్, శ్రీనివాస్, రమేష్, భాస్కర్, లతీఫ్, సంషీద్, దాసరి తిరుపతి, సుభాన్ పాషా, సంతోష్, శ్రవణ్ కుమార్, రవీందర్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.