స్వామి వివేకానంద ఆశయ సాధనకు కృషి
ABVP:ఏబీవీపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163 వ జయంతి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమం ప్రారంభించారు. జిల్లా వ్యవస్థ ప్రముఖ్ చెట్టి శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ లావుడ్య అనిల్ మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయ సాధనకు ఏబీవీపీ కృషి చేస్తుందన్నారు. స్వామి వివేకానంద భారత దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప మహానుభావుడని కొనియాడారు. స్వామి వివేకానంద మాట ఏబీవీపీ బాట అనే నినాదంతో ఏబీవీపీ పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ మంచిర్యాల కార్పొరేషన్ అధ్యక్షులు పెంట మహేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంజయ్, కార్పొరేషన్ ఉపాధ్యక్షులు ఆదిత్య, ఏబీవీపీ నాయకులు విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.