బుగ్గ దేవాలయం లో ప్రత్యేక పూజలు
కార్తీక మాస సోమవారాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామంలో కొలువైన ప్రసిద్ధ శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయం భక్తులతో పోటెత్తింది. పవిత్రమైన కార్తీక సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
మూడు కొండల మధ్య, ప్రశాంతమైన అరణ్య వాతావరణంలో వెలిసిన ఈ పురాతన ఆలయంలోని శివలింగానికి గర్భగుడిలోని భూగర్భ జలధార (బుగ్గ) ద్వారా నిరంతరం సహజసిద్ధంగా అభిషేకం జరుగుతూ ఉండటం ఇక్కడి అత్యంత విశిష్టమైన అంశం. ఆలయ గర్భగుడి నుండి ప్రవహించే ఈ బుగ్గ నీరు దక్షిణ దిశగా ఉన్న కోనేరులోకి చేరుతుంది. కార్తీక సోమవారం నాడు భక్తులు తెల్లవారుజామునే ఈ కోనేటిలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో వేచి ఉంటారు