పోలీసులను సన్మానించిన ప్రజాప్రతినిధులు
తాండూరు మండలం సీఐ, మాదారం ఎస్ఐని ప్రజాప్రతినిధులు సన్మానించారు. నీలాయిపల్లి సర్పంచ్ పొలవేణి తిరుపతి, ఉపసర్పంచ్ రాపల్లి సతీష్ మాదారం ఎస్ఐ సౌజన్య, తాండూరు సీఐ దేవయ్యను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని సన్మానించారు. తాండూరు సీఐ దేవయ్య మాట్లాడుతూ ప్రజాప్రతినిధులుగా యువత గెలవడం సంతోషమన్నారు. గ్రామాభివృద్దికి తమ వంతు సాయం అందించాలని వారికి సూచించారు. ముఖ్యంగా గ్రామంలోని యువతపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.