ఆ నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌..

Banks were closed for those four days: మీకు బ్యాంకులో ఏదైనా ప‌ని ఉంటే వెంట‌నే చేసుకోండి లేక‌పోతే ఇబ్బందులు త‌ప్పేలా లేవు. బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు బంద్ కానున్నాయి. ఇప్పటికే మూడు రోజులు సెలవులు ఖరారు కాగా.. నాలుగో రోజు బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునివ్వడంతో వరుసగా బ్యాంకులు మూతపడనున్నాయి.

జనవరి 24న నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు. మరుసటి రోజు జనవరి 25 ఆదివారం సెలవు. ఆ తరువాత జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు హాలిడే ఉంటుంది. దీంతో మూడు రోజులు బ్యాంకులకు అధికారికంగా సెలువులు వచ్చాయి. జనవరి 27న కూడా బ్యాంకులు మూత ప‌డ‌నున్నాయి. బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. ఐదు రోజుల పనిదినాలను కోరుతూ జనవరి 27వ తేదీన సమ్మెను ప్రకటించారు. దీంతో ఆ రోజు కూడా బ్యాంకులు బంద్ ఉండ‌నున్నాయి. ఒకవేళ సమ్మె కొన‌సాగితే వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంక్ శాఖలు దేశవ్యాప్తంగా మూతపడే అవ‌కాశం ఉంది. దీంతో ఈనెలాఖరులో మొత్తం బ్యాంకులు మూతపడే అవకాశం లేకపోలేదు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like