జంపన్న వాగులో భక్తుడు మృతి
Medaram 2026:మేడారంలో జాతరలో అపశ్రుతి చోటు చేసుకుంది. జంపన్నవాగులో మునిగి ఓ భక్తుడు మృతి చెందాడు. మృతుడిని మంచిర్యాల జిల్లా భీమారానికి చెందిన కొమ్ము శ్రీనివాస్ యాదవ్ గా గుర్తించారు. బుధవారం ఉదయం మేడారంలో మహా జాతర ప్రారంభం అవుతున్న నేపథ్యంలో శ్రీనివాస్ సమ్మక్క, సారలమ్మ దర్శనానికి ముందు సంప్రదాయ స్నానం కోసం జంపన్నవాగులోకి దిగి.. ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. వరదలో కొట్టుకుపోవడంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు.