కుప్ప‌కూలుతున్న బంగారం ధ‌ర

Gold Rate Today:ఆకాశానికి దూసుకుపోయిన బంగారం, వెండి ధ‌ర‌లు దిగివ‌స్తున్నాయి. రెండు రోజులుగా భారీగా ప‌త‌న‌మైన బంగారం ధ‌ర వరుసగా 3వ రోజు కూడా కుప్ప‌కూలింది. ఈ రోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 830 తగ్గి రూ. 13,890 లకి చేరుకుంది. 24 క్యారెట్ల ధర కూడా రూ. 905 తగ్గి రూ. 15,153 లకి పడిపోయింది. మరొకవైపు వెండి ధర కూడా రూ. 20 తగ్గి రూ. 300 లకి చేరింది.

కొంత కాలంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, యుద్ధ వాతావరణం, డోనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై విధించిన టారిఫ్స్, డాలర్ పతనం వంటి వివిధ కారణాలతో భారీగా పెరిగిన బంగారం ధరలు, పరిస్థితులు కొంత మేర సద్దుమన‌గడం.. డాలర్ ఇండెక్స్ పెరగడంతో ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించి ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. దీంతోనే బంగారానికి డిమాండ్ తగ్గి ధర పతనం అవుతోంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక గ్రాము 22 క్యారట్ల బంగారం ధర (Gold Price Today) ఏకంగా రూ. 830 తగ్గి రూ. 13,890, అలాగే 8 గ్రాముల బంగారం ధర రూ. 6640 తగ్గి రూ. 1,11,120, అదేవిధంగా 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 8300 తగ్గి రూ. 1,38,900 లుగా ఉంది, నిన్నటి ధరలతో పోల్చితే ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 8300 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ. 905 తగ్గి రూ. 15,153 లుగాను, అలాగే 8 గ్రాముల బంగారం ధర రూ. 7240 తగ్గి రూ. 1,21,224 లుగా, అదేవిధంగా 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 9050 తగ్గి రూ. 1,51,530 లుగా ఉంది, ఇక నిన్నటి ధరలతో పోల్చితే ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 9050 తగ్గింది.

అదేవిధంగా ఒక గ్రాము వెండి ధర (Silver Price Today) కూడా ఏకంగా రూ. 20 తగ్గి రూ. 300 లుగాను, అలాగే 8 గ్రాముల వెండి ధర రూ. 160 తగ్గి రూ. 2400 లుగాను, అదే విధంగా 10 గ్రాముల వెండి ధర రూ. 200 తగ్గి రూ. 3000 లుగా ఉంది, ఇక నిన్నటి ధరతో పోల్చితే ఈరోజు 10 గ్రాముల వెండి ధర రూ. 200 తగ్గింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like