బంగారం.. మరింత పతనం
Gold Rates Today:సామాన్యుడికి అందనంతగా ఆకాశంలోకి దూసుకువెళ్లిన బంగారం, వెండి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. బంగారం ధరలు మళ్లీ డౌన్ అయ్యాయి. గంటల వ్యవధిలోనే ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బులియన్ మార్కెట్లో సెకన్ సెకన్‌కు ట్రేడింగ్‌లో గోల్డ్ రేట్లలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. మంగళవారం మరోసారి గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గుతూ వస్తోన్నాయి. గోల్డ్, సిల్వర్ రేట్లు వేలల్లో తగ్గుతూ వస్తోండగా.. మంగళవారం గంటల వ్యవధిలోనే మరోసారి గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి.
బంగారం ధర మంగళవారం రూ.1500 మేర తగ్గగా వెండి రూ. 20 వేలు తగ్గింది. ఈ తగ్గింపు తర్వాత ప్రస్తుతం హైదరాబాద్‌లో తులం బంగారం ధర రూ.1,51,750గా ఉంది. సోమవారం ఈ ధర రూ.1,53,170 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే నేడు రూ.1420 తగ్గుముఖం పట్టింది. ఇక నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,39,100 వద్ద ఇప్పుడు కొనసాగుతోంది. ఇక వెండి ధరల విషయానికొస్తే.. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.80 లక్షలుగా ఉంది. నిన్న ఈ ధర రూ.3 లక్షలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే మంగళవారం కేజీ వెండిపై రూ.20 వేలు తగ్గింది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరులో కూడా కేజీ వెండి రూ.2.80 లక్షలుగా కొనసాగుతోంది.