అనుమతులు లేవని అడ్డంకులు
మాజీ మంత్రి, సీనియర్ బీఆర్ఎస్ నేత హరీష్‌రావు ప్రచారానికి అనుమతులు లేవని అధికారులు, పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం చెన్నూరు నియోజకవర్గం క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో మాజీ మంత్రి హరిశ్ రావు ప్రచార కార్యక్రమం ఉంది. అయితే, ఈ ఏర్పాట్లను అడ్డుకున్న అధికారులు, పోలీసులు అడ్డుకున్నారని వారు స్పష్టం చేస్తున్నారు. అనుమతులు లేవని సాకుతో ప్రచారానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ నేతల ఆరోపిస్తున్నారు. ఇది రాజకీయ ప్రేరణతో చేసిన అడ్డంకులేనని బీఆర్ఎస్ నాయకుల విమర్శలు వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ ఆదేశాలతోనే అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని గులాబీ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రచార హక్కును కాలరాస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇలాంటివి మానుకోవాలని వారు స్పష్టం చేశారు.