మంత్రి గారూ.. ఇదేం తీరు..

Minister Vivek:మంత్రి వివేక్ ఎన్నికల నియమావళి ఉల్లంఘించారు. చెన్నూర్ మున్సిపాలిటీ NP వాడలో 4,5 వ బూత్ ల వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు, అభ్యర్థులతో బైక్ పైన తిరుగుతూ మంత్రి వివేక్ ప్రచారం చేశారు. ఓ వైపు 144 సెక్షన్ అమలులో ఉండ‌గానే… పోలింగ్ కేంద్రాల వద్ద పెద్దఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో క‌లిసి తిరిగారు. నిషేధం ఉన్నా బైక్ పై ర్యాలీ గా తిరిగారు.

మంగ‌ళ‌వారం సైతం ఇదే తరహాలో క్యాతన్ పల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో తిరుగుతా మంత్రి ప్రచారం చేశారు. దీంతో మంత్రి తీరుపై విమర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు, పోలీసులు క‌నీసం ప‌ట్టించుకోక‌పోవ‌డం ప‌ట్ల ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మంత్రి వివేక్ తీరు పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు.ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన మంత్రి వివేక్ పై కేసు నమోదు చేయాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.

You might also like