ఎమ్మెల్యేపై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలి

TBGKS:క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ఇన్చార్జిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున వెళ్ళిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ‌ లక్ష్మీపై బనాయించిన అక్రమ కేసు వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేర‌కు బెల్లంపల్లి ఏరియా ఉపాధ్య‌క్షుడు మల్రాజ్ శ్రీనివాసరావు విలేక‌రుల‌తో మాట్లాడారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు స్పష్టమైన ఆధిక్యత ఉన్నా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఆ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్, మంత్రి వివేక్ అధికార బలం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని అన్నారు. అక్క‌డ చైర్మ‌న్ ఎన్నిక అడ్డుకోవ‌డ‌మే కాకుండా, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ , ఎమ్మెల్యే కోవలక్ష్మీపై కేసులు పెట్టడం సరికాదన్నారు.

ఇప్పటికైనా ఎమ్మెల్యే కోవలక్ష్మీ, బాల్క సుమన్, టీబీజీకేఎస్, బీఆర్ఎస్ నేత‌ల‌పైన పెట్టిన కేసులను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధరావత్ మంగీలాల్, సెంట్రల్ కమిటీ నాయకులు అనుముల సత్యనారాయణ, ఓరం కిరణ్, పిట్ కార్యదర్శి మెరుగు రమేష్, ఆఫీసు ఇన్చార్జిలు వంగ మహేందర్, మైదం వీరస్వామి, సీహెచ్‌పీ అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి మర్రి సమ్మయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like