బీఆర్ఎస్ కౌన్సిలర్ కిడ్నాప్
జిఈ నెల 4న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపధ్యంలో ఖానాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఐదవ వార్డు ఇంద్రనగర్ కౌన్సిలర్ మేష పోసాని అతని కుమారుడు మేస సతీష్ ని కిడ్నాప్ చేశారని పోలీస్ స్టేషన్ లో ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు రాజు ఫిర్యాదు చేశారు. అపహరించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ముందు ఈ ఘటన జరగడం ప్రజాస్వామ్యానికి మచ్చగా అభివర్ణించారు. వెంటనే పోసానిని సురక్షితంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేకపోతే ఎన్నికల రోజు ఖానాపూర్ పట్టణాన్ని అష్ట దిగ్బంధనం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు.