కార్మికుల హక్కుల సాధనలో INTUC ముందుంది
-మెడికల్ బోర్డు, నియామక పత్రాల పునరుద్ధరణ INTUC పోరాట ఫలితం
-PERKS పై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు, సొంతింటి కల సాకారం చేస్తాం
-INTUC సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్
Singareni:కార్మికుల హక్కుల సాధణలో INTUC ఎల్లప్పుడూ ముందుంటుందని ఆ యూనియన్ సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్(INTUC General Secretary Dr. B. Janak Prasad) స్పష్టం చేశారు. RG-3 ఏరియాలోని OCP-2 వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ మెడికల్ బోర్డు వ్యవస్థ పునరుద్ధరించేందుకు యాజమాన్యం, ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం సాధించిన ఘనత INTUCకే దక్కుతుందన్నారు. గుర్తింపు సంఘం వైఫల్యం కారణంగా నిలిచిపోయిన నియామక పత్రాల పంపిణీని కూడా ప్రభుత్వ స్థాయిలో ప్రస్తావించి పునఃప్రారంభించేందుకు కృషి చేసినది తామే అన్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు PERKS పై విధిస్తున్న ఆదాయపు పన్ను రద్దు కోసం INTUC పోరాటం కొనసాగిస్తుందన్నారు. మారు పేర్ల మార్పు సమస్య పరిష్కారం కోసం యూనియన్–యాజమాన్య సంయుక్త కమిటీకి ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. కార్మికుల సొంత ఇంటి కలను కూడా కచ్చితంగా సాకారం చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో పనిచేసిన BRS ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో సింగరేణికి ఎంతో నష్టం జరిగిందన్నారు. MMDR చట్టానికి మద్దతు, బొగ్గు గనుల వేలం ప్రక్రియలో సింగరేణికి జరిగిన నష్టం, రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు, కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోయగూడెం బ్లాక్-III, సత్తుపల్లి బ్లాక్-III వంటి విలువైన బొగ్గు గనులు సింగరేణికి దక్కకుండా పోవడం వల్ల సంస్థకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాల వయోపరిమితి 35 నుండి 40 సంవత్సరాలకు పెంపు, శాశ్వత కార్మికులకు రూ.1 కోటి ప్రమాద బీమా, కాంట్రాక్టు కార్మికులకు రూ.40 లక్షల బీమా, సోలార్, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల విస్తరణ, హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు వంటి నిర్ణయాలు అమలులోకి వచ్చాయన్నారు. RG-3 ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహారెడ్డి, ధర్మపురి, వైస్ ప్రెసిడెంట్ దాస్, సెక్రటరీలు గడ్డం తిరుపతి యాదవ్, రామారావు, ఉయ్యాల కుమారస్వామి, పిట్ సెక్రటరీలు మనోహర్, చారి, నాయకులు మడ్డి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.