అమెరికాకు భారీ ఎదురుదెబ్బ..

ఒకే రోజులో రెండు యుద్ధవిమానాలు కూల్చిన ఇరాన్

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల్లో అమెరికా అనేక షాక్‌లను ఎదుర్కొంటోంది. ఒకే రోజులో రెండు అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ కూల్చింది. మ‌రో రెండు హెలికాప్టర్లపై కూడా దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘ‌టన‌లో మరొక పైలట్ గల్లంతైనట్లు సమాచారం. శుక్రవారం అమెరికాకు చెందిన ఎఫ్‌-15ఈ స్ట్రైక్‌ ఈగల్‌ యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసింది. ఈ విమానంలో ఒక పైలట్, వెపన్‌ సిస్టమ్ అధికారి ఉన్నారు. ఒకరిని రక్షించామని, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోందని అమెరికా, ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఘటనల గంటల్లోనే హర్మూజ్ సమీపంలో ఏ-10 వార్‌థగ్ ఫైటర్ జెట్‌ను కూడా ఇరాన్ కూల్చేసింది.

ఇరాన్ కూల్చిన ఈ విమాన శకలాలు కువైట్‌లో పడినా, ఆ పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. మొదటి యుద్ధ విమానంలో గల్లంతైన పైలట్‌ను రక్షించడానికి రెండు బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు గాలింపు చేపట్టాయి.
వీటిపైనా ఇరాన్ దాడి చేసింది, అయితే వీటిని తప్పించుకుని సురక్షితంగా గగనతలం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఏ-10 యుద్ధ విమానం కూలిన దృశ్యాలను ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఘటనలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ ఇలాంటి సంఘటనలు దౌత్య చర్చలపై ప్రభావం చూపవు. ఇది యుద్ధం, మేం యుద్ధంలోనే ఉన్నామన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like