త‌గ్గేదేలే..

భార‌త జీడీపీ వృద్ధి రేటు 6.6

ప్ర‌పంచ‌వ్యాప్తంగా యుద్ధ‌మేఘాలు, అనిశ్చితి కొన‌సాగుతోంది. అయినా… ఈ అంశాలేవీ భార‌త ఆర్థిక స్థిర‌త్వాన్ని ప్ర‌భావం చేయ‌డం లేదు. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ ధృడంగా ముందుకు సాగుతుంద‌ని ప్ర‌పంచ‌బ్యాంక్ త‌న నివేదిక‌లో స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్‌ మరింత పెంచింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇది 6.6 శాతం వరకు ఉంటుందని తెలిపింది. మ‌ధ్య ప్రాచ్యంలో ఉద్రిక‌త్త‌ల నేప‌థ్యంలో ముఖ్యంగా ఇరాన్, అమెరికా యుద్ధ స‌మ‌యంలో ప్ర‌పంచ దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు అత‌లాకుత‌లం అవుతున్నాయి. అయితే, ఈ ప్ర‌భావం మాత్రం భార‌త‌దేశంపై త‌క్కువ‌గానే ఉంటుంద‌ని ప్ర‌పంచ బ్యాంకు స్ప‌ష్టం చేసింది.

ప్రపంచ బ్యాంక్‌ గత ఏడాది అక్టోబరులో విడుదల చేసిన ఒక నివేదికలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం వరకు ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పుడు దానిని 6.6 శాతం పెంచ‌డం గ‌మ‌నార్హం. ఇంధన సెగతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రిటైల్‌ ద్రవ్యోల్బణం పుంజుకున్నా, దేశీయ డిమాండ్‌, వినియోగం భారత జీడీపీకి దన్నుగా నిలుస్తాయని అంచనా వేసింది.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like