మేడిగడ్డకు సీఎం.. కేసీఆర్ ప్రజా గర్జన!

-ఈ రోజు ఇద్ద‌రు అగ్ర‌నాయ‌కుల ప‌ర్య‌ట‌న‌లు
-మేడిగ‌డ్డ‌కు వెళ్ల‌నున్న ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి
-బ్యారేజీ పరిశీలన.. అక్కడే అధికారులతో సమీక్ష
-రెండో విడ‌త రైతు భ‌రోసా నిధుల విడుద‌ల
-జగిత్యాలలో నేడు ప్రజా ఆశీర్వాద సభ
-ఏడాది తర్వాత ప్రజాక్షేత్రంలోకి బీఆర్‌ఎస్‌ చీఫ్
-ఆయన సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్న జీవన్‌రెడ్డి
-కేసీఆర్ ఏం మాట్లాడ‌తారో అంటూ ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి

Telangana:ఈ రోజు రాష్ట్రంలో  కీల‌క ప‌రిణామం చోటు చేసుకోనుంది. ఓ వైపు ముఖ్య‌మంత్రి మేడిగ‌డ్డ‌కు వెళ్తుండ‌గా, మ‌రో వైపు ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జగిత్యాల‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. మేడిగ‌డ్డ వ‌ద్ద‌నే అక్క‌డే అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హిస్తారు. అంత‌కుముందు ముఖ్య‌మంత్రి కాళేశ్వ‌రంలో రూ. 200 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక‌, కేసీఆర్ జగిత్యాల జిల్లా వెళ్ల‌నున్నారు. అక్క‌డ నిర్వ‌హించ‌నున్న ప్రజా ఆశీర్వాద సభ లో చంద్రశేఖర్‌రావు సమక్షంలో జీవన్‌రెడ్డి ఆ పార్టీలో చేరతారు.  ఏడాది త‌ర్వాత కేసీఆర్ బ‌య‌ట‌కు రానున్న సంద‌ర్భంగా ఆయ‌న ఏం మాట్లాడాత‌ర‌నే విష‌యంలో ఉత్కంఠ నెల‌కొంది.

ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తారు. కాళేశ్వ‌రంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవాలయంలో రూ. 200 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను మంత్రులు ఉత్తమ్‌, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పరిశీలిస్తారు. మేడిగడ్డ వద్ద మట్టి పరీక్షలు పూర్తి చేసి, నవంబరు, డిసెంబరు నాటికి పునరుద్ధరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యారేజీ పరిశీలించనున్న సీఎం రేవంత్‌.. అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. కాటారం మండలం నస్తూర్‌పల్లిలో రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేస్తారు.

కేసీఆర్ ఈ రోజు జ‌గిత్యాల‌కు వెళ్ల‌నున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభ పేరిట సోమవారం బీఆర్‌ఎస్‌ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహి స్తోంది. ఈ సభలోనే బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమక్షంలో జీవన్‌రెడ్డి ఆ పార్టీలో చేరనున్నారు. సభను విజయవంతం చేసేందుకు బీఆర్‌ఎస్‌ యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేతలు రెండు మూడు రోజులుగా జగిత్యాలలోనే మకాం వేశారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఎల్కతుర్తి సభలో పాల్గొన్న కేసీఆర్‌.. సుమారు ఏడాది తర్వాత జగిత్యాల సభ ద్వారా మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభలో కేసీఆర్‌ ఏం మాట్లాడతారన్నదానిపై అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like