కవిత కొత్త పార్టీ… తెలంగాణ రాష్ట్ర సేన
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ గా వెల్లడించారు. శనివారం మేడ్చల్ జిల్లా మునీరాబాద్ ఆవిర్భావ సభ లో ఆమె ఈ ప్రకటన చేశారు. కవిత కొత్త పార్టీ పేరు ప్రకటించి జెండాను ఆవిష్కరించారు. ఆ సమయంలో కవిత అనుచరులు నినాదాలు చేశారు. అంతకు ముందు గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద కవిత నివాళులర్పించారు.