శిక్ష‌ణ వ‌ల్ల పిల్ల‌ల్లో మాన‌సిక దృఢ‌త్వం

-పోలీస్ సమ్మర్ క్యాంప్ ప్రారంభం
-550 మంది విద్యార్థుల భాగస్వామ్యం

Police Summer Camp:“పిల్ల‌ల‌కు శిక్షణ వల్ల ప్రత్యేక కళల్లో ప్రావీణ్యం సంపాదించి ఉన్నత స్థాయికి ఎదుగుతార”ని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆయ‌న పోలీసుల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న స‌మ్మ‌ర్ క్యాంప్ చిన్నారులతో కలిసి ఆర్చరీ, వాలీబాల్ ఆడి ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ యువత, చిన్నారులకు ఒకే అంశంపై పదేపదే శిక్షణ అందించడం ద్వారా వారు ఆ కళలో నిష్ణాతులు అయ్యి ఉన్నత స్థానానికి ఎదుగుతారని తెలిపారు. పోలీసులు, ప్రజలకు ఉన్న సత్సంబంధాలు ఇలాంటి కార్యక్రమాల వల్ల మెరుగుపడతాయని తెలిపారు. ముఖ్యంగా ఆటల వల్ల పిల్లలకు, విద్యార్థినీ విద్యార్థులకు మానసిక శారీరక దృఢత్వం లభిస్తుందని తెలిపారు.

సమ్మర్ క్యాంపు ద్వారా పిల్లలకు ఆటవిడుపుగా ఉంటుందని అన్ని రంగాలలో సరైన శిక్షణ అందించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఈ సమ్మర్ క్యాంపులో టేబుల్ టెన్నిస్, ఆర్చరీ, యోగ, కరాటే, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్ బాల్ త‌దిత‌ర అంశాల్లో పిల్ల‌లు త‌ర్ఫీదు ఇస్తున్నారు.కార్యక్రమంలో అదనపు ఎస్పి బి సురేందర్ రావు, డీఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్, మావల ఎస్ హెచ్ ఓ రాహుల్ కాంత్, ఇన్స్పెక్టర్లు కె.నాగరాజు, బి సునీల్ కుమార్, ప్రేమ్ కుమార్, జి శ్రావణ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, ఎన్ చంద్రశేఖర్, కరాటే మాస్టర్ ప్రవీణ్, యోగ మాస్టర్ చైతన్య, పీఈటి సందీప్, రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నార్నూర్, బోథ్ ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ క్యాంపులు ప్రారంభమయ్యాయి. మొత్తం 550 మంది విద్యార్థులు పాల్గొంటుండగా, ఆదిలాబాద్ కేంద్రంలోనే 270 మంది పాల్గొన్నారు. వేసవి సెలవుల్లో పిల్లలకు ఆటవిడుపుతో పాటు క్రమశిక్షణ, ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. మొబైల్ ఫోన్‌లకు దూరంగా ఉండి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని పిల్లలకు పిలుపునిచ్చారు. ఈ క్యాంప్‌లో భాగంగా ప్రత్యేక రోజుల్లో పోలీస్ స్టేషన్, జైలు సందర్శనలతో పాటు పోలీస్ డాగ్స్ పనితీరుపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like