అంగ‌న్‌వాడీ సెల‌వుల పొడిగింపు

Minister Seethakka:తెలంగాణలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం అంగన్‌వాడీ వేసవి సెలవులు పొడ‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. మే 1 నుంచి జూన్ 1 వరకు (నెల రోజుల పాటు) పిల్లలకు సెలవులు ఇవ్వ‌గా…. ఎండ‌ల తీవ్ర‌త త‌గ్గ‌క‌పోవ‌డంతో మ‌రో వారం రోజుల పాటు సెల‌వులు పొడిగిస్తున్న‌ట్లు రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కవెల్ల‌డించారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటిలోని అంగన్వాడీ కేంద్రం-4 సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా సీత‌క్క అంగన్వాడీ విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేయడంతో పాటు చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించారు. పౌష్టికాహార లోపంతో ఉన్న పిల్లల తల్లిదండ్రులకు సమతుల్య ఆహారం, పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.

బాలింతల కోసం సంప్రదాయబద్ధంగా శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించి తల్లి-శిశు ఆరోగ్యం, పోషకాహారం, అంగన్వాడీ సేవల వినియోగం పై మంత్రి సీతక్క వివరించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలు తీర్చిదిద్దుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలన్నారు.

 

You might also like