ఆదిలాబాద్ చేరుకున్న డీజీపీ ఆనంద్
ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం డీజీపీ సీవీ ఆనంద్ పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా చేరుకున్నారు. ఈ సందర్భంగా మల్టీజోన్ వన్ ఐజి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర ఉన్నతాధికారులు సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర డీజీపీతో పాటు ఉమెన్ సేఫ్టీ, సిఐడి, ఏసీబీ డీజీపీ చారు సిన్హా సైతం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చారు. ఇద్దరు అధికారులకు జిల్లా అధికారులు పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు.