ఆర్టీసీ బ‌స్సులో పొగ‌లు… డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌తో త‌ప్పిన ప్ర‌మాదం

TSRTC:ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం డోంగర్ గావ్ వద్ద జాతీయ రహదారి-44పై ఆర్టీసీ బస్సుకు ప్ర‌మాదం త‌ప్పింది. బ‌స్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డుపక్కన ఆపడంతో ప్రయాణికులు క్షేమంగా దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

You might also like