సర్ పకడ్బందీగా అమలు చేయాలి
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 37, 51, 40 డివిజన్లలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్లకు అందిస్తున్న ఎన్యుమరేషన్ ఫారాల ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఓటర్ల వద్దకు వెళ్లిన సమయంలో ఎన్యుమరేషన్ ఫారం అందించినప్పుడు బి ఎల్ ఓ యాప్ లో మార్క్ చేయాలని తెలిపారు. ఓటరు ఎన్యుమరేషన్ ఫారం నింపిన తరువాత తిరిగి సేకరించి యాప్ లో వివరాలు నమోదు చేయాలని తెలిపారు. మరణించిన వారు, గ్రామం వదిలి వెళ్ళిన వారు, 2 అంతకు మించి ఎపిక్ కార్డులు కలిగి ఉండడం అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఒకరికి ఒక ఓటరు గుర్తింపు కార్డు మాత్రమే ఉండేలా స్పష్టమైన జాబితా రూపొందించాలని తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాలు నింపిన తరువాత తిరిగి సేకరించి బి ఎల్ ఓ యాప్ లో ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలు స్పష్టంగా నమోదు చేయాలన్నారు.