పేదల బియ్యంతో భారీ దందా.. మంచిర్యాలలో లారీ పట్టివేత

PDS Rice:మంచిర్యాల జిల్లాలో భారీ స్థాయిలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా యత్నాన్ని సివిల్ సప్లయ్ టాస్క్ ఫోర్స్ అధికారులు భగ్నం చేశారు. హైదరాబాద్ సివిల్ సప్లయ్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా డీఎస్పీ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో UP 94 T 6022 నంబర్ లారీని నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపులోకి తీసుకున్నారు.

అధికారుల తనిఖీల్లో లారీలో సుమారు 28 టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ బియ్యాన్ని కరీంనగర్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు అక్రమంగా తరలించే ప్రయత్నం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

స్వాధీనం చేసుకున్న బియ్యంపై పంచనామా పూర్తి చేసిన అధికారులు, అనంతరం దానిని నస్పూర్ ఎంఎల్ఎస్ (MLS) పాయింట్‌కు తరలించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ముఠా, నెట్‌వర్క్‌పై సివిల్ సప్లయ్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసుకు సంబంధించిన నిందితుల వివరాలను సేకరిస్తూ తదుపరి చర్యలు చేపడుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like