ఇంట్లోకి చొరబ‌డ్డాడు.. చిక్కాడు..!

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని మారుతి నగర్‌లో అర్థరాత్రి దొంగలు హల్‌చల్ సృష్టించారు. ఇద్దరు దొంగలు ఓ ఇంట్లోకి చొరబడగా, అప్రమత్తమైన స్థానికులు వారిలో ఒకరిని పట్టుకున్నారు. అనంతరం దొంగ చేతులు కట్టేసి పోలీసులకు అప్పగించారు. అయితే మరో దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పట్టుబడిన దొంగను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

You might also like