తెలంగాణలో SIR గడువు పొడిగింపు..

ఆగస్టు 3వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ ఈసీ ఉత్తర్వులు

ఎట్ట‌కేల‌కు తెలంగాణ‌లో స‌ర్(SIR) గ‌డువు పొడిగించారు. ఆగ‌స్టు 3వ తేదీ వ‌ర‌కు బీఎల్‌వోలు ప్ర‌తి ఇంటికి వ‌చ్చి ఓట‌ర్ల వివ‌రాల‌ను సేక‌రించి, న‌మోదు చేయ‌నున్నారు. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ముందుగా నిర్ణయించిన గడువు ముగియనున్న నేపథ్యంలో, ఓటర్ల సౌకర్యార్థం ఆగస్టు 3, 2026 వరకు గడువును పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు, సవరణలు, తొలగింపులు, చిరునామా మార్పు వంటి దరఖాస్తులను ఆగస్టు 3 వరకు సంబంధిత ఎన్నికల అధికారులకు సమర్పించవచ్చని ఈసీ స్పష్టం చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటరు వివరాలను సరిచూసుకుని అవసరమైన మార్పులు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు.

ఆగ‌స్టు 10న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుద‌ల చేయ‌నున్నారు. ఆగ‌స్టు 10 నుంచి సెప్టెంబ‌ర్ 9వ తేదీ వ‌ర‌కు అభ్యంత‌రాల‌ను స్వీక‌రించ‌నున్నారు. అక్టోబ‌ర్ 12న తుది జాబితాను వెల్ల‌డించ‌నున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like