విద్యార్థుల ప్రాణాలకు రక్షణ ఏది…?

BRSV మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్

బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో సుమారు 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందడం అత్యంత ఆందోళనకరమని BRSV మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్ పేర్కొన్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థ పూర్తిగా విఫలమైందనే దానికి ఈ ఘటన నిదర్శనమని అన్నారు.

ఈ ఘటనపై వెంటనే ఉన్నతస్థాయి విచారణ జరిపి, నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలల్లో అందించే ఆహారం నాణ్యత, పరిశుభ్రత, నిర్వహణపై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడితే BRSV చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బాధిత విద్యార్థినులందరికీ మెరుగైన వైద్యం అందించడంతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే విద్యార్థుల భద్రత కోసం BRSV రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో BRSV పట్టణ అధ్యక్షులు ఆడెపు అరుణ్, మాజీ పట్టణ అధ్యక్షులు మురుకురి శ్రావణ్, పట్టణ కార్యదర్శి బుద్ధర్తి సుమంత్, నితీష్, రాజు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like