రైలు ఢీకొని చిరుతపులి మృతి
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజూర తహసీల్ పరిధిలో బల్లార్ష–కాజీపేట్ రైల్వే మార్గంలో రైలు ఢీకొని ఓ చిరుతపులి మృతి చెందింది. సుమారు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న మగ చిరుతపులిగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
నియత్ క్షేత్ర మూర్తి పరిధిలోని కంపార్ట్మెంట్ నంబర్ 590లో, బల్లార్ష–కాజీపేట్ రైల్వే డౌన్ లైన్‌పై పోల్ నంబర్ 152/26 సమీపంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. రైలు వేగంగా ఢీకొనడంతో చిరుత తలకు తీవ్ర గాయాలయ్యాయని, ఆ గాయాల కారణంగానే మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై అటవీ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.