బంగారు దుకాణంలో చోరీ.. కలకలం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని సంతోషి గోల్డ్ వర్క్ దుకాణంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు రాత్రి సమయంలో దుకాణంలోకి ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఉదయం దుకాణంలో చోరీ జరిగినట్లు గుర్తించిన యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దుకాణంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ చోరీకి పాల్పడిన దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

చోరీకి గురైన బంగారం, వెండి వస్తువుల పూర్తి వివరాలు, వాటి విలువ ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You might also like