పీడీఎస్‌ బియ్యం అక్రమ తరలింపు.. వాహనం పట్టివేత

మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట ఓ వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు.

ఈ వ్యవహారంలో మంచిర్యాల ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తితో పాటు మరో యూట్యూబర్‌ పాత్రపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీడీఎస్‌ బియ్యం అక్రమ తరలింపు దందాకు కొందరు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

వాహనంలో ఉన్న బియ్యం ఎక్కడి నుంచి తరలిస్తున్నారు..? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? ఈ అక్రమ రవాణా వెనుక ఎవరెవరి పాత్ర ఉంది..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

అక్రమ పీడీఎస్‌ బియ్యం తరలింపులో ఎవరైనా అధికారులు.. ఇతర వ్యక్తులు భాగస్వాములై ఉన్నట్లు తేలితే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

You might also like