జెండా గుండెల నిండా

జాతీయ జెండాతో తాండూరు మండ‌ల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. యూనియన్ బ్యాంక్ అండర్ బ్రిడ్జి నుంచి ప్రారంభమైన తిరంగా యాత్ర ఐబీ ప్రధాన కూడలి అండర్ బ్రిడ్జి మీదుగా కొనసాగింది. భారీ జాతీయ జెండాతో సాగిన యాత్రలో దేశభక్తి నినాదాలు మార్మోగాయి. జాతీయ జెండాల రెపరెపలు, విద్యార్థుల నినాదాలతో తాండూరులో దేశభక్తి వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశభక్తి అనేది మాటల్లో మాత్రమే కాదు.. దేశం పట్ల మన బాధ్యతలో కనిపించాలని అన్నారు. “దేశం మనకు ఏమిచ్చిందని ప్రశ్నించే ముందు.. దేశానికి మనం ఏమిచ్చామని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి” అని పిలుపునిచ్చారు. “కులం, మతం, ప్రాంతం ఏదైనా కావచ్చు.. మనందరి మొదటి గుర్తింపు భారతీయుడే. దేశం ఒక్కటే.. జెండా ఒక్కటే.. మన గమ్యం ఒక్కటే” అని పేర్కొన్నారు.

ఈ తిరంగా యాత్రలో స్థానిక విద్యా భారతి, సెయింట్ థెరిస్సా పాఠశాలలకు చెందిన ప‌లువురు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 500 మీట‌ర్ల జాతీయ ప‌తాకం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. చిన్నారుల చేతుల్లో జాతీయ జెండాలు, దేశభక్తి నినాదాలతో విద్యా భారతి విద్యార్థుల బ్యాండ్ యాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మండల అధ్యక్షుడు దూడపాక భరత్ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామగౌని మహీధర్ గౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, తిరంగా ర్యాలీ ఇన్‌చార్జి రాచర్ల సంతోష్ కుమార్, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఎమాజీ, సీనియర్ నాయకులు పులగం తిరుపతి, బొల్లెడ్ల కేశవరెడ్డి, యంగర్ తుకారాం, జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్ధం మల్లేష్, మండల ప్రధాన కార్యదర్శి పుట్ట కుమార్, ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు పాగిడి చిరంజీవి, నర్సింగ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏముర్ల ప్రదీప్, మండల నాయకులు, జాతీయవాదులు అభినవ సంతోష్ కుమార్, గాదె రాజేశం, చొక్కాల నాగభూషణ్, ఏముర్ల ప్రవీణ్, తిరుపతి, గుజ్జేటి శేఖర్, ప్రభాకర్, అడ్వాల సతీష్, ఎలిగేటి నరేష్, ఆనంద్, కామెర మహేష్, శ్రావణ్ , త‌దిత‌రులు పాల్గొన్నారు.

You might also like