ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జూపల్లి పర్యటన
రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఆగస్టు 17, 18 తేదీలలో ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఆగస్టు 17, 2026 (సోమవారం):
ఉదయం 06:00 గంటలకు: హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి జాతీయ రహదారి (NH 44) మీదుగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు రోడ్డు మార్గంలో పయనం.
ఉదయం 10:00 నుండి సాయంత్రం 04:00 వరకు: ఉట్నూర్‌లోని గడ్డం నాగిరెడ్డి గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.
సాయంత్రం 05:00 గంటలకు: ఉట్నూర్ నుంచి కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని ఎస్.పి.ఎం (SPM) గెస్ట్ హౌస్ వెళ్తారు.
రాత్రి 07:00 గంటలకు: ఎస్.పి.ఎం గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. సోమవారం రాత్రికి అక్కడే బస చేస్తారు.
ఆగస్టు 18 (మంగళవారం):
ఉదయం 09:20 గంటలకు: కాగజ్‌నగర్ ఎస్.పి.ఎం గెస్ట్ హౌస్ నుంచి పయనం.
ఉదయం 09:30 నుండి 11:30 వరకు: కాగజ్‌నగర్‌లోని రన్ గ్రాండ్ బ్యాంక్వెట్ హాల్‌లో జరిగే సిర్పూర్ (టి) నియోజకవర్గ అవగాహన సమావేశంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 12:00 గంటలకు: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో.. వాంకిడి – కాగజ్‌నగర్ రోడ్డుపై రూ. 8.50 కోట్లతో నిర్మించనున్న హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
మధ్యాహ్నం 12:55 నుండి 01:45 వరకు: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా IDOC మీటింగ్ హాల్‌లో ‘ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి’ పథకం కింద లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ చేస్తారు… ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం – 2వ దశ’ కింద లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందచేస్తారు.
మధ్యాహ్నం 01:45 గంటలకు: IDOC మీటింగ్ హాల్ నుంచి రెబ్బెన మండలంలోని గోలేటి గెస్ట్ హౌస్‌కు పయనం.
మధ్యాహ్నం 02:15 నుండి 03:00 వరకు: గోలేటి గెస్ట్ హౌస్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.
మధ్యాహ్నం 03:00 గంటలకు: గోలేటి గెస్ట్ హౌస్ నుంచి తిరిగి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.