బెల్లంపల్లి లో రోడ్డు ప్రమాదం.. సింగరేణి కార్మికుడి మృతి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మరణించాడు. బోయపల్లి నుంచి బెల్లంపల్లి వైపు వస్తున్న బైక్ ను బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎండమూరి సురేష్ అనే సింగరేణి కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇతను శాంతిఖని లో విధులు నిర్వహిస్తున్నాడు.
మరొక కార్మికుడు కన్నాల బస్తికి చెందిన గట్టు చిరంజీవికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, బొలెరో వాహనం డ్రైవర్ పరిస్థితిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనతో శాంతిఖని, కన్నాల బస్తీ ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.