మంచిర్యాల జిల్లాలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లింగాయపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం రూ.11 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.
లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. పంచాయతీ కార్యదర్శిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనతో జన్నారం మండలంలో కలకలం రేగింది.