నేను ఓడిపోతా: మంత్రి గడ్డం వివేక్
రాష్ట్రంలో ప్రభుత్వం ఎప్పటికీ కొనసాగుతుందనే గ్యారెంటీ తనకు లేదంటూ మంత్రి వివేక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. పాలిటెక్నిక్ విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో స్కిల్ యూనివర్సిటీ నుంచి పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లరని ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వగలదా? అని ఓ విద్యార్థి ప్రశ్నించగా మంత్రి వివేక్ ఆసక్తికరంగా స్పందించారు.
”రేపు నేను ఓడిపోతా.. మా గవర్నమెంట్ పోతది. నా గ్యారెంటీతో మీకేం ఫాయిదా?” అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారుల విషయంలో వ్యక్తిగత హామీ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏముంటుందని మంత్రి ప్రశ్నించారు.
స్కిల్ యూనివర్సిటీపై పెట్టుబడులు, ప్రభుత్వం మారితే ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంటుంది అనే విద్యార్థుల సందేహాలకు మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. ప్రభుత్వంపై నమ్మకం, పెట్టుబడిదారులకు భరోసా, భవిష్యత్ ప్రభుత్వాల విధానాలపై ఈ వ్యాఖ్యలు కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
మంత్రి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.