ఘనంగా ప్రజాపాలన సంబురాలు
రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గంలో భారీగా బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు నివాసం నుంచి ప్రారంభమై బెల్లంపల్లి చౌరస్తా మీదుగా వెంకటేశ్వర టాకీస్, ఐబీ చౌరస్తా, సీసీసీ కార్నర్ చౌరస్తా వరకు ఉత్సాహభరితంగా సాగింది.
ఈ భారీ ర్యాలీలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాలే రాయలింగు, సింగిల్ విండో వైస్ చైర్మన్ శ్రీపతి మల్లేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు..