ఆదిలాబాద్ లో విషాదం… మంచిర్యాల విద్యార్ధి ఆత్మహత్య

​ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ ఫౌండేషన్ కోర్స్ శిక్షణ తీసుకుంటున్న మంచిర్యాల జిల్లాకు చెందిన స్వామిరామం అనే విద్యార్థి భవనం మూడో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితులతో టిఫిన్‌కు వెళ్తానని చెప్పిన కాసేపటికే ఈ అఘాయిత్యానికి పాల్పడటంతో అక్కడి విద్యార్థులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఫౌండేషన్ కోర్సు శిక్షణ పొందుతున్న ఓ విద్యార్థి మూడో అంతస్తు పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

​మృతుడిని మంచిర్యాల జిల్లాకు చెందిన స్వామిరామంగా గుర్తించారు. గత నాలుగు నెలలుగా ఆదిలాబాద్‌లోనే ఉంటూ కోచింగ్ తీసుకుంటున్న స్వామిరామం.. ఆదివారం ఉదయం స్నేహితులు టిఫిన్ చేద్దామని పిలవగా, వస్తానని చెప్పి భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలపాలైన అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

​వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించి, పూర్తి వివరాల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.

You might also like