బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్
హైదరాబాద్‌లో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మంచిర్యాల పట్టణంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్థానిక బస్టాండ్ నుంచి హైదరాబాద్ బయలుదేరుతున్న బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి (మీడియా ప్యానలిస్ట్) తుల ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బస్టాండ్‌లో బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకుని, బలవంతంగా వాహనంలో ఎక్కించి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తుంటే ప్రభుత్వం అక్రమ అరెస్టులతో అణచివేయాలని చూస్తోందని బీజేపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.