ఐదుకు చేరిన మృతులు

ఆదిలాబాద్ రిమ్స్ (RIMS) ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ (SNCU) వార్డులో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. నిన్న‌టి వ‌ర‌కు ముగ్గురు చిన్నారులు మృత్యువాత ప‌డ‌గా, మరో ఇద్దరు చిన్నారులు సైతం మ‌ర‌ణించారు. ఒక‌రు రిమ్స్ లో,నిలోఫర్ వెళ్తుండగా చ‌నిపోయారు. మృతుల్లో దుబ్బగూడ, లింగాపూర్ కు చెందిన వారిగా గుర్తించారు.

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ (SNCU) వార్డులో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. నిన్నటి వరకు ముగ్గురు నవజాత శిశువులు మృత్యువాత పడగా.. తాజాగా మరో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందగా.. మరో చిన్నారి నిలోఫర్ ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. మృతుల్లో దుబ్బగూడ, లింగాపూర్ ప్రాంతాలకు చెందిన చిన్నారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

రెండు రోజుల కింద‌ట‌ అర్ధరాత్రి రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూ వార్డులో ఏసీ యూనిట్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఏసీ యూనిట్‌లో పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో ఆసుపత్రిలోని సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు భయంతో ఉలిక్కిపడ్డారు. క్షణాల్లోనే దట్టమైన పొగ వార్డును కమ్మేసింది.

ప్రమాదం జరిగిన సమయంలో ఎస్‌ఎన్‌సీయూ వార్డులో మొత్తం 27 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతున్నారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే సిబ్బంది, చిన్నారుల కుటుంబ సభ్యులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వార్డులోకి వెళ్లి పలువురు చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

అయితే అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన ఓ శిశువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతున్న మరో నలుగురు చిన్నారులు కూడా మృత్యువాత పడ్డారు. మృతుల్లో రెండు, ఐదు, పదిహేను రోజుల వయసున్న పసికందులు ఉండటం ఈ విషాదాన్ని మరింత కలచివేస్తోంది. మృతులంతా ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాలకు చెందినవారిగా గుర్తించారు.

పసికందుల వరుస మరణాలతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి దారితీసిన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

You might also like