భర్తను చంపిన భార్య

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్ రోడ్డులో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్తను భార్య రోకలిబండతో కొట్టి హత్య చేసింది. దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి…

అశోక్ రోడ్డుకు చెందిన మోహన్‌ను అతని భార్య జమున రోకలిబండతో మోది హతమార్చినట్లు ప్రాథమికంగా సమాచారం.. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

మోహన్‌, జమున దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉన్నట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హత్యకు దారితీసిన అసలు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

You might also like