తాగిన మైకంలో సొంత ఇంటికే నిప్పు

మద్యం మత్తులో ఓ వ్యక్తి సొంత ఇంటికే నిప్పంటించిన ఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉట్ల రఘు మద్యం సేవించి తన తండ్రిపై కోపంతో ఇంటికి నిప్పు పెట్టారు. తండ్రిపై ఆగ్రహంతో రఘు ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఇంట్లో మంటలు చెలరేగడంతో స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ ఘటనలో ఇంటికి సంబంధించిన వస్తువులు, సామగ్రి దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నష్టంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

You might also like