సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారుస్తున్నరు..
సింగరేణి(Singareni) సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న రూ. 55 వేల కోట్లు చెల్లించకపోవడంతో సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి(BJP State Vice President Raghunath Verabelli) ఆవేదన వ్యక్తం చేశారు. నస్పూర్ సీసీసీ కార్నర్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న సింగరేణి బకాయి బీజేపీ లడాయి వేదికను పరిశీలించిన ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ వద్ద ఆర్ధిక వనరులు లేకపోవడంతో సంస్థ నూతన గనులు ఏర్పాటు చేయలేకపోతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల భద్రతకు అవసరం అయ్యే బూట్లు, పనిముట్లు, టోపీలు కొనలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
సింగరేణి సంస్థ పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ రేపు బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా లో ముఖ్య అతిథిగా మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్(Malkajgiri MP Etela Rajender), ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్(Adilabad MP Godam Nagesh), బీజేపీ MLA లు హాజరు కానున్నారని తెలిపారు. కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, సత్రం రమేష్, కుర్రే చక్రవర్తి, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, కమలం రావు, బేర సత్యనారాయణ, కమలాకర్ రావు, పొన్నవేణి సదయ్య, మల్కా రాజేశం, బుద్దే రవి, బద్రి శ్రీకాంత్, బూర్ల చిరంజీవి, కొండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు