కోతిని వేటాడుతూ… చిరుత మృత్యువాత..

కోతిని వేటాడుతున్న క్రమంలో ఓ చిరుత విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు తగిలి మృత్యువాత పడింది. ఈ విషాద ఘ‌ట‌న మహారాష్ట్రలోని చంద్రపుర్‌ జిల్లా చిమూరు తాలూకాలో చోటుచేసుకుంది. శంక‌రాపూర్ గ్రామ ప‌రిధిలో కోతిని వేటాడుతున్న క్రమంలో ఓ చిరుత విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి మృత్యువాత పడింది. చంద్రపుర్‌ జిల్లా చిమూరు తాలూకా పరిధిలోని శంకరాపూర్‌ గ్రామంలో ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది.

శంకరాపూర్‌ గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్న ఐదేళ్ల వయసున్న ఆడ చిరుత ఒక వానరాన్ని వేటాడే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కోతిని తరుముకుంటూ గ్రామ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పైకి ఎక్కింది. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురికావడంతో చిరుత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుత కళేబరాన్ని చిమూరు అటవీ క్షేత్రానికి తరలించి అక్క‌డ పోస్టుమార్టం (శవ పరీక్ష) నిర్వహించారు. అనంతరం నిబంధనల ప్రకారం దానిని ఖననం చేసినట్లు అధికారులు తెలిపారు.

You might also like