దేశం మీ వెంట ఉంది…
కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా
స్మిత్ నమస్తే…. మొత్తం దేశం మీ వెంట ఉంది… మహామృత్యుంజయ మంత్రంతో మీ గురించి ప్రార్థిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన ఫ్లై దుబాయ్ విమాన కాక్‌పిట్‌లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో వీడియో కాల్‌లో మాట్లాడారు. యూఏఈలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అత్యంత క్లిష్ట సమయంలో చూపిన ధైర్యం, సమయస్ఫూర్తిని మోదీ అభినందించారు. ”ప్రయాణికుల ప్రాణాల కోసం పోరాడిన మీ ధైర్యం ప్రశంసనీయంసస సంక్షోభ సమయంలో స్మిత్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి ఎంతో గొప్పవని మోదీ అన్నారు.
కుటుంబానికి మోదీ హామీ
తన ప్రాణాలను పట్టించుకోకుండా ప్రయాణికుల భద్రత కోసం పోరాడటం అభినందనీయమని పేర్కొన్నారు.
ఆయన త్వరగా కోలుకోవాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు భారతీయులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు వెనుకాడరని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. అంతకుముందే కెప్టెన్ స్మిత్ కుటుంబ సభ్యులతోనూ ప్రధాని మోదీ మాట్లాడారు. అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం స్మిత్ యూఏఈలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని భారత అధికారులు వెల్లడించారు