మిస్ ఇండియా ఎర్త్ వాటర్ 2026 విజేతకు సన్మానం

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ కి చెందిన ప్రీతి ముండే మిస్ ఇండియా ఎర్త్ వాటర్ 2026 పోటీలో విజేతగా నిలవడం ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ గర్వకారణమని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు.శుక్రవారం సన్మాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష పాల్గొని ఆమెను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ, మారుమూల గ్రామీణ ప్రాంతమైన హీరాపూర్ నుంచి వచ్చిన ప్రీతి ముండే జాతీయ స్థాయి పోటీలో విజయం సాధించడం ఎంతో అభినందనీయమన్నారు. తన ప్రతిభ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ఈ స్థాయికి చేరుకుని ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

  • ప్రీతి ముండే సాధించిన విజయం జిల్లాలోని యువతీ యువకులకు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రతిభ, కృషి, పట్టుదలతో ముందుకు సాగితే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా జాతీయ స్థాయిలో రాణించవచ్చని ఆమె నిరూపించారని పేర్కొన్నారు.

యువతీ యువకులు తమలో ఉన్న ప్రతిభను గుర్తించి, లక్ష్యాలను నిర్దేశించుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రీతి ముండే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఆదిలాబాద్ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

You might also like