డిగ్రీ అధ్యాపకుడు గజెల్లి మోహన్‌కు డాక్టరేట్
రాజస్థాన్ సన్‌రైజ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పరిశోధనకు గుర్తింపుగా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న గజెల్లి మోహన్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. రాజస్థాన్‌లోని సన్‌రైజ్ యూనివర్సిటీ నుంచి ఆయన ఈ డాక్టరేట్‌ను పొందారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ యోగేంద్ర కుమార్ పర్యవేక్షణలో “పరిపాలన.. నైతికత – పరిపాలనా నిర్ణయీకరణలో నైతికత పాత్ర: ఒక పరిశీలన” అనే అంశంపై పరిశోధన చేశారు. పరిశోధన గ్రంథాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించిన అనంతరం గురువారం ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్ డాక్టర్ గీతా యాదవ్ ఆధ్వర్యంలో ఓపెన్ వైవా నిర్వహించారు. పరిశోధన అంశాలపై మోహన్ ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా ఉండడంతో విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
25 ఏళ్లుగా అధ్యాపక వృత్తిలో గజెల్లి మోహన్ 2001 నుంచి బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా కొనసాగుతున్నారు. కళాశాలలో వివిధ విద్యా, పరిపాలనా బాధ్యతలను నిర్వహించారు. సామాజిక సేవలోనూ ముందంజలో ఉంటున్నారు ఆయన. విద్యార్థి దశ నుంచే సామాజిక సేవపై ఆసక్తి పెంచుకున్న మోహన్ అనేక సంక్షేమ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా బెస్ట్ యూత్ అవార్డు, బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డు, రాష్ట్ర గవర్నర్ అవార్డు, బెస్ట్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అవార్డు, బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డుతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు సంస్థల నుంచి అవార్డులు అందుకున్నారు. జన విజ్ఞాన వేదిక, లోక్‌సత్తా, తెలంగాణ విద్యావంతుల వేదిక తదితర సంస్థల్లో సేవలందించారు. ఎన్నికల నిఘా వేదిక, సంఘమిత్ర యూత్ క్లబ్, జ్ఞానమిత్ర గ్రంథాలయం వంటి సామాజిక సంస్థల కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యమయ్యారు.
గజెల్లి మోహన్‌కు పీహెచ్డీ డాక్టరేట్ లభించడంపై బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపెల్లి శంకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, వివిధ సేవా సంఘాల ప్రతినిధులు మోహన్‌ను అభినందించారు. ఈ సందర్భంగా గజెల్లి మోహన్ మాట్లాడుతూ పీహెచ్డీ పట్టా సాధించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. డాక్టరేట్ సాధించే క్రమంలో తనకు సహకరించిన అధ్యాపకులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.