ఈ నెల 5న ప్రజావాణి రద్దు
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ఈ నెల 5న(సోమవారం) మంచిర్యాల జిల్లాలో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లాలో ఈ నెల 5న ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా సమావేశానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. దీంతో జిల్లాలోని కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రజావాణి యథాతధంగా నిర్వహిస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని తెలిపారు.