“ఆ స్నేహానికి స‌లాం”..

చిన్ననాటి స్నేహానికి ఇదే అసలైన అర్థం!

చిన్ననాటి స్నేహం కాలంతో పాటు మారదు.. కష్టకాలంలో తోడుగా నిలిచినప్పుడే ఆ బంధం అసలైన విలువ తెలుస్తుంది. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్ననాటి మిత్రుడిని పరామర్శించి, ఆపద సమయంలో ఆర్థిక అండగా నిలిచారు 1989–90 బ్యాచ్‌ స్నేహితులు.

హుజరాబాద్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న తమ చిన్ననాటి మిత్రుడు నెల్లి శ్రీనివాస్‌ను స్నేహితులు కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మిత్రుల తరఫున రూ.40 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌కు తాము అండగా ఉంటామని, అవసరమైన సమయంలో తోడుగా నిలుస్తామని స్నేహితులు తెలిపారు. చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన స్నేహితుడి కష్టాన్ని తమ కష్టంగా భావించి ముందుకొచ్చిన ఈ స్నేహబంధం పలువురిని కదిలించింది. స్నేహం అంటే కలిసి నవ్వుకోవడమే కాదు.. కష్టాల్లో ఒకరికొకరు అండగా నిలవడమే నిజమైన స్నేహానికి నిర్వచనం అని 1989–90 బ్యాచ్‌ స్నేహితులు చాటిచెప్పారు.

You might also like