సింగ‌రేణి భ‌వ‌న్ ముట్ట‌డి.. ఉద్రిక్త‌త‌..

Singareni:సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ రక్షణ సేన ఆందోళనకు దిగింది. ఈ రోజు (సోమవారం) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) ఆధ్వర్యంలో.. సింగరేణి భవన్‌‌ ముట్టడికి యత్నించారు. హెచ్ఎంఎస్‌, టీఆర్ఎస్ నాయ‌కులు పెద్ద ఎత్తున సింగ‌రేణి భ‌వ‌న్‌కు చేరుకోవ‌డంతో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ సింగరేణి లాభాల్లో కార్మికులకు 35% వాటా చెల్లించాలని, మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ అన్ ఫిట్ చేయాలని డిమాండ్ చేశారు. నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలని, మారుపేర్ల కార్మికుల సమస్య పరిష్కరించాలని పట్టుబట్టారు.

ఈ సంద‌ర్భంగా ప‌లు డిమాండ్ల‌ను క‌విత సింగ‌రేణి యాజ‌మాన్యం ముందుంచారు… జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయాలని… విజిలెన్స్ పేరుతో ఆపిన డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ప్రతి కార్మికుడికి సొంత ఇంటి పథకం కోసం 2 గుంటల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారామే… సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు కేటాయించాలన్నారు. సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు చేయాలని… కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ సిఫార్సుల మేరకు జీతాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం సింగరేణికి బాకీ పడిన రూ.62 వేల కోట్లు వెంటనే చెల్లించాలని స్ప‌ష్టం చేశారు.

సింగ‌రేణి ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌లన్నింటిని మీద సింగ‌రేణి సీఎండీ వెంట‌నే ఇక్క‌డ‌కు వ‌చ్చి స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు క‌విత‌.

 

You might also like